సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచే విధంగా ఫేక్ వార్తలు, పోస్టులు పెడితే చర్యలు తప్పవని ధర్మారం డిఎస్పి బి. హేమంత్ కుమార్ ఆదివారం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ షేర్ చేయడం, అనుచిత/అసభ్య పోస్టులను వైరల్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.