ధర్మవరం పేట బసవన్న కట్ట వీధిలోని శ్రీ త్రిలింగేశ్వర దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మాట్లాడుతూ. మాఘ మాసం రథసప్తమి సందర్భంగా స్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అనంతరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకట హరీశ్ కుటుంబ సభ్యులతో శ్రీ త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.