ధర్మవరం మండలంలోని గ్రామీణ ఎస్సీ కులములకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సాయి మనోహర్ బుధవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు, సరళమైన తిరిగి చెల్లింపు నిబంధనలతో అందుబాటులో ఉంటాయని తెలిపారు.