ధర్మవరం: పరిటాల శ్రీరామ్ కు అరెస్ట్ వారెంట్

70చూసినవారు
ధర్మవరం: పరిటాల శ్రీరామ్ కు అరెస్ట్ వారెంట్
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కు ఏజేఎఫ్‌సీఎం కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని 2021లో అనంతపురం రెండో పట్టణ స్టేషన్ లో వారి పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు గురువారం ఆయన హాజరు కాకపోవడంపై ఏజేఎఫ్సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. దింతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్