ధర్మవరం పట్టణంలోని కేశవ నగర్‌లో భక్తిశ్రద్ధలతో, విశేషమైన భౌతిక నిర్మాణ శైలి తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం బుధవారం ఘనంగా ప్రారంభించబడింది. అనేకమంది భక్తులు, స్థానిక ప్రజలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనాన్ని పొందారు. ఆలయ కమిటీ వారి ఆహ్వాన మేరకు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై, అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.