ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ బలిజ సంఘం నాయకులు ఎస్. పవన్ కుమార్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్త సుబ్బరాయుడుని కలిసి బలిజ సంఘం అభివృద్ధి కోసం మరింత సహాయ, సహకారాలు అందించాలని శనివారం వినతి పత్రాన్ని అందజేశారు. ముదిగుబ్బలో బలిజలు అధిక సంఖ్యలో వున్నారని వారికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. చంద్రన్న స్వయం ఉపాధి పథకాలు, బలిజ సంక్షేమ పథకాలను అందించి సహకరించాలని కోరారు.