ధర్మవరం పట్టణం యాదవ్ వీధిలో నూతనంగా నిర్మిస్తున్న స్వయంభు వరసిద్ధి వినాయక దేవాలయంలో రాజగోపురం భూమి పూజ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆలయ అర్చకులు రేవనూరు సుబ్రహ్మణ్యం శర్మ ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచన తదుపరి స్వామి వారి అభిషేక మూర్తికి పంచామృత అభిషేకం, వాస్తుమండల ఆరాధన, రాజగోపుర స్థలంలో భూమి సంప్రోక్షణ, నవరత్న, పంచలోహ, ఓషధి, నవధాన్య, గర్తాన్యాసం, నవశిల స్థాపనం కార్యక్రమాలు చేపట్టారు.