ధర్మవరం పట్టణం కేశవ నగర్లో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప స్వామి ఆలయాన్ని మే 14వ తేదీన ప్రారంభిస్తామని గురుస్వామి విజయ్ కుమార్ తెలిపారు. ఆలయం వద్ద ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల గురించి ధర్మవరం బీజేపీ నేత హరీష్, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.