ధర్మవరం మండలం చిగిచెర్ల సమీపంలో ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు దగ్ధం అయినా సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. అనంతపురం నుంచి ధర్మవరం వస్తున్న కారు లో చిగిచెర్ల సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ భాగంలో పొగలు వచ్చాయి. గమనించిన వాహన డ్రైవర్ వెంటనే కారులో ఉన్న వారందరిని కిందకు దిగమని చెప్పాడు. దీంతో ప్రయాణికులు కారులో నుంచి క్రిందకు దిగి వచ్చి ప్రమాదం నుంచి బయట పడ్డారు.