ధర్మవరం మండలంలోని రేగాటిపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులైన రైతులకు వేరుశనగ విత్తన మూటలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ప్రతి రైతుకు మద్దతుగా నిలుస్తుందని తెలియజేశారు.