ముదిగుబ్బ మండలంలో జరిగిన భూ అక్రమాలపై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ వందల ఎకరాలు భూ అక్రమాలకు పాల్పడిట్టు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై రెవెన్యూ శాఖ నుంచి నివేదిక తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉన్నారు.