ధర్మవరం పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు సాయి నగర్ లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సాయినాథ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన జరిగి 25 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా రజోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సాయిబాబా సేవా సమితి ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వీరనారాయణ, రామలింగయ్య, సూర్య ప్రకాష్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.