ధర్మవరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శానిటేషన్ ప్రక్రియను ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పర్యవేక్షించారు. శుక్రవారం తెల్లవారుజామున శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలతో కలిసి వార్డులో తిరుగుతూ పనులు పర్యవేక్షించారు. వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని వారికి సూచించారు.