ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు

50చూసినవారు
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు
ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం బి. ఏ, బీకాం, బీఎస్సీలలో స్పాట్ అడ్మిషన్ పొందడానికి ఈ నెల 26వ తేదీ వరకు విద్యార్థులకు గడువు పెంచామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్లలో చేరిన వారికి ప్రభుత్వం నుంచి లభించే ఎలాంటి స్కాలర్ షిప్పులు లభించవని అన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరవాలన్నారు.

సంబంధిత పోస్ట్