ధర్మవరం పట్టణంలోని ఎల్సికేపురంలో గల భవిత సెంటర్ నందు శనివారం ప్రభుత్వం వారు అలిమికో కంపెనీ ద్వారా ఐదు మంది దివ్యాంగ పిల్లలకు ఉపకరణ సామాగ్రిని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ చేతులమీదుగా అందజేశారు. అనంతరం ఎంఈఓలు మాట్లాడుతూ వినికిడి లోపం గల పిల్లలకు వినికిడి యంత్రాలను, నడవలేని పిల్లలకు రోల్ లెటర్స్ ను, కూర్చోలేని పిల్లలకు సిపి కుర్చీలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.