ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో శనివారం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యులైన క్రియాశీలక వాలింటీర్లను ప్రతి ఒక్కరిని శాలువాతో సత్కరించి సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా చిలకం మధు మాట్లాడుతూ కార్యకర్తల కుటుంబాలకు భరోసా అందించేందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు.