రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందనీ డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. కన్నా వెంకటేష్ చేసిన ఈ సేవలు ఎంతో మందికి స్ఫూర్తి కావాలని తెలిపారు.