ధర్మవరం వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల వైఎస్ఆర్సిపి ధర్మవరం పట్టణ క్లస్టర్-2 అధ్యక్షుడిగా కోటిరెడ్డి బాలిరెడ్డి నీ నియమించడంతోపాటు పట్టణ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగింది. అనంతరం అందరూ కూడా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఘనంగా సన్మానించారు.