రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెట్టారని మంత్రి సత్య కుమార్ బుధవారం మండిపడ్డారు. వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారని, ఇప్పుడు మొసలి కన్నీరు కరుస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లలో గుర్రం నాడా మాత్రం తెచ్చి, ఏడాదిలో గుర్రం ఎందుకు తేలేదని ప్రశ్నిస్తున్నారన్నారు. జగన్ చేతకానితనం ఇవాళ వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శాపంలా మారిందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించారు.