ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేశారు. 197 కంటి రోగుల్లో 165 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. నిర్వాహకులు జైసింహా, ప్రతినిధులు నరేందర్ రెడ్డి, నాగభూషణం, ప్రసన్నకుమార్, రత్నశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.