ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్ల పంపిణీ తెల్లవారుజామున కాకుండా 7 గంటల తర్వాత ఇచ్చే విధంగా సమస్య పరిష్కరించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మంగళవారం ధన్యవాదాలు తెలిపింది. తెల్లవారుజాము నుంచి పన్షన్ పంపిణీ చేయాలన్న నిబంధనల కారణంగా సచివాలయ సిబ్బంది ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ విషయాన్ని మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు.