ధర్మవరం పట్టణంలో నివసించే చేనేత కార్మికుడు మంటేద్దుల సూర్యనారాయణ రెడ్డి కొడుకు చరణ్ తేజ రెడ్డి నిన్న విడుదల అయిన ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో 465/470 మార్కులు, రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విద్యార్థి తండ్రి సూర్యనారాయణ రెడ్డి చేనేత కార్మికుడుగా కూలీ పని చేస్తూ విద్యార్థి చరణ్ ను చదివించాడు. విద్యార్థి చరణ్ ఆదివారం మాట్లాడుతూ భవిష్యత్తులో ఉత్తమ ఇంజనీరు కావడమే తన లక్ష్యమని తెలిపాడు. ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి విద్యార్థిని అభినందించారు.