ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చినట్లు ప్రిన్సిపల్ జే. వి. సురేశ్ బాబు బుధవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్ ఛార్జ్ హరీశ్ బాబు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు 5 కంపెనీ ప్రతినిధులు వచ్చారన్నారు. 56 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా 32 మంది వివిధ కంపెనీలకు ఎంపికైనట్లు వివరించారు.