ధర్మవరంలో అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుందామని డీఎస్పీ హేమంత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ధర్మవరం నియోజవర్గానికి చెందిన ఏపీయూడబ్ల్యూజే కమిటీతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. పోలీసులు, పాత్రికేయులు ఫ్రెండ్లీగా ముందుకు సాగుదామన్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.