ధర్మవరం: వడదెబ్బకు వీడ్కోలు పలుకుదాం.. అందరూ ఆరోగ్యంగా ఉందాం

67చూసినవారు
ధర్మవరం: వడదెబ్బకు వీడ్కోలు పలుకుదాం.. అందరూ ఆరోగ్యంగా ఉందాం
ధర్మవరం వేసవికాలంలో ప్రజలందరూ వడదెబ్బకు వీడ్కోలు పలకాలని తద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మే 17న వేసవి తాపముపై పోరాటం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ పంచాయితీలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్