ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాయి కృప జూనియర్ కళాశాల, వాసవి జూనియర్ కళాశాల, పలు కళాశాల విద్యార్థులను సోమవారం స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.