ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం నిర్వహించిన 'ప్రపంచ రక్తదాతల దినోత్సవం'లో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. సేవకు పర్యాయపదమైన రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు సర్ జీన్ హెన్రీ డునాంట్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి రక్తదాతలు, కొవిడ్ వారియర్స్, రెడ్ క్రాస్ సిబ్బంది, వైద్యులకు ప్రశంసాపత్రాలు, అవార్డులు అందించి, అభినందించారు.