రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాజీ రాష్ట్రపతిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి పుష్పగుచ్ఛంతో కూడిన పూల కుండీ అందించారు. అనంతరం కాసేపు భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.