కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్స్ సవరణ బిల్లుకు నిరసనగా ధర్మవరంలోని ముస్లిం మైనారిటీలు, ఆదివారం రెండో రోజు ఎమ్మార్వో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. మౌలానా సోహెల్ ఫాతిమా మసీద్ సభ్యులు మాట్లాడుతూ. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముస్లిం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందన్నారు. ఆస్తులకు సంబంధించిన జీవోను పార్లమెంటుకు తీసుకొని రావడం జరిగిందని వారు తెలిపారు.