ధర్మవరంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు మంగళవారం నాలుగో రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఖుభ్ర మజీద్, హంజా మజీద్ సభ్యులు మాట్లాడుతూ. ఎన్. డి. ఏ కూటమి ప్రభుత్వం ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. వక్స్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.