ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8, 9వ తేదీలలో నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ బృందం పర్యటించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి శనివారం తెలిపారు. వారు మాట్లాడుతూ న్యాక్ ప్రమాణాలతో కళాశాల అభివృద్ధిని, సంస్థాగత విలువల్ని పర్యవేక్షించి అవసరమైన పురోగతిని సూచించనున్నారు అని తెలిపారు.