ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జెవి రమణ కార్మిక సంఘం నాయకులు నాగరాజు పాల్గొన్నారు.