ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం సంతోషకరమన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం మంది, సెకండ్ ఇయర్‌లో 83 శాతం మంది ఉత్తీర్ణులు కావడం గొప్ప విషయం అని కొనియాడారు.