ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదివారం ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన నాన్న పరిటాల రవీంద్రతో దిగిన చిన్ననాటి ఫోటోను సోషియల్ మీడియాలో పంచుకున్నారు. నాన్న.. నా వెన్నంటే ఉండే నా ధైర్యం. నన్ను నడిపించే నమ్మకం. నాకు వేలాదిమంది అభిమానులను ఇచ్చిన నా దైవం అని గుర్తుచేసుకుంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.