ధర్మవరం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రతే మా లక్ష్యమని ఆర్పిఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజి అధికారిని కుమారి ఆరోమాసింగ్ ఠాగూర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరంలోని ఆర్పిఎఫ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఆర్పిఎఫ్ లో నమోదైన కేసుల వివరాలు, వాటి పరిష్కార వివరాలను ఆర్పీఎఫ్ సిఐ నాగేశ్వరరావు ద్వారా అడిగి తెలుసుకున్నారు.