ధర్మవరం పురపాలక సంఘానికి చెల్లించాల్సిన అన్ని పన్నలను వెంటనే చెల్లించి మునిసిపల్ ఆదాయ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ గురువారం తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన పాత బకాయిలు వసూలు చేయు నిమిత్తం సచివాలయ సిబ్బందితో పాటు కార్యాలయ సిబ్బంది, వార్డులలో వసూలు నిమిత్తం తిరుగుతున్నందున, పన్ను చెల్లింపు దారులు, సహకరించి పన్నులు చెల్లించి రసీదు పొందాలన్నారు.