ధర్మవరంలోని శారదానగర్ లో బుధవారం వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు సచివాలయ ఉద్యోగులు అవగాహన కల్పించారు. వాట్సాప్ లోనే 161 ప్రభుత్వ సేవలు పొందవచ్చని సచివాలయ ఉద్యోగులు నిఖిల్, గురు కుమార్ ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యత పట్ల ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.