ధర్మవరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ దరఖాస్తుకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్ బాబు ఒక ప్రకటన లో బుధవారం తెలిపారు. 10వ తరగతి పరీక్షకు హాజరైన వారు, ఇదివరకే పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు అందరూ కూడా అర్హులన్నారు. దరఖాస్తు రుసుము బీసీ, ఓసీ వారికి రూ. 400 ఎస్సీ, ఎస్టీ వారికి కేవలం రూ. 100 మాత్రమే ఉంటుందని తెలిపారు.