ధర్మవరం పట్టణంలో సిద్దయ్య గుట్టలో నివసించే పేద విద్యార్థి బాబా ఫక్రుద్దీన్ నిన్న విడుదల అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటారు. విద్యార్థి ఎంపీసీ గ్రూపులో 927/1000 మార్కులు సాధించారు. విద్యార్థి తండ్రి జహీర్ బండి మీద పండ్ల వ్యాపారం చేస్తూ కొడుకును చదివించారు. విద్యార్థి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉత్తమ ఇంజనీరు అవ్వడమే తన లక్ష్యమని తెలిపారు.