ధర్మవరం మండలంలో అక్రమ మద్యం అమ్ముతున్న వారిపై ఎక్సైజ్ పోలీసులు కొరడా జులిపించారు. శుక్రవారం ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో దాసరి నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపి 115 కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు.