సత్యసాయి జిల్లా వైయస్సార్సీపి యాక్టివిటీ సెక్రటరీగా ధర్మవరం పట్టణానికి చెందిన కే. రమాదేవి నియమితులైనట్లు వైయస్సార్సీపి వర్గాలు శనివారం తెలిపాయి. రమాదేవి 2021 మున్సిపల్ ఎన్నికల్లో ధర్మవరం 30వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించారు. తనపై నమ్మకం తో యాక్టివిటీ సెక్రటరీగా నియమించినందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు.