కందుల కొనుగోలు మద్దతు ధర కోసం రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ధర్మవరం మండల వ్యవసాయ అధికారి ముస్తఫా పేర్కొన్నారు. శనివారం ధర్మవరం మండలం కుణుతూరు, పోతుకుంటలోని రైతు సేవ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కందుల మద్దతు ధర రూ.7750 అంతేకాకుండా మద్దతు ధర ఏది ఎక్కువగా ఉంటే ఆ ధరకు కందులు కొనుగోలు చేస్తున్నామని కావున రైతులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.