ధర్మవరం పట్టణంలోని ఎన్డీయే కార్యాలయంలో బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో సమీక్ష మంత్రి సత్య కుమార్ నిర్వహించారు. హాస్పిటల్ లో వైద్య సౌకర్యాలు, అవసరమైన యంత్రాలు, సిబ్బంది పనితీరు, మందులు లభ్యత గురించి వాకబు చేశారు. ప్రజలకు తక్షణ, మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. సమయపాలన, హాజరు కచ్చితంగా పాటించాలని, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించాలి అన్నారు.