ధర్మవరం మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పెండింగ్ ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ధర్మవరం డివిజన్ కో కన్వీనర్ ఆయిల్ డిమాండ్ చేశారు. సోమవారం ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ను కలిసి గత నాలుగు నెలలుగా వర్కర్లకు జీతాలు రాలేదని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆది హైదరవల్లి పాల్గొన్నారు.