ధర్మవరం పట్టణంలోని శివానగర్ లో ప్రసిద్ధి చెందిన పాఠశాలలో హెడ్మాస్టర్ సీ. వి శేషు ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ సి. వి శేషు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.