ధర్మవరంలోని పేట బసవన్నకట్ట వీధిలోని శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ సభ్యులు సురేశ్ గురువారం పేర్కొన్నారు. దేవాలయంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 8న స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.