ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ హబ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గదులను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ టీఎస్ చేతన్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో స్కిల్ డెవలప్మెంట్ హబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన గదులను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.