ధర్మవరంలో కంటి క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని శుక్రవారం రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో పట్టణంలోని పలు డాక్టర్లకు ప్రపంచ కంటి క్యాన్సర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో పాటు వారు కరపత్రాలను విడుదల చేశారు.