ధర్మవరం మండలం బడన్నపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు సనావుల్లా మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇచ్చారు. పురుగుల ఉధృతి బట్టి మాత్రమే పురుగు మందులు పిచికారి చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఈవో అశ్విని, గ్రామ రైతులు పాల్గొన్నారు.