ధర్మవరం-తిరుపతి మధ్య తిరిగే రైళ్లను నెల రోజులపాటు రద్దు చేస్తున్నట్లు సోమవారం రైల్వే అధికారులు ప్రకటించారు. కేవలం 17248, 17247 ఎక్స్‌ప్రెస్ రైలు నర్సాపూర్-కదిరి మధ్య తిరుగుతుందన్నారు. గుంతకల్లు-తిరుపతి మధ్య తిరిగే ప్యాసింజ రైళ్ల రద్దుతో పాటు నాగర్ కోయిల్, పద్మావతి, 7హిల్స్, అమరావతి, మదురై తదితర రైళ్లు గుత్తి మీదుగా రేణిగుంటకు చేరుతాయని పేర్కొన్నారు. ధర్మవరం-కదిరి మధ్య ఎలాంటి రాకపోకలు ఉండవని అన్నారు.